- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారి నుంచి నాకు ప్రాణభయం: శ్రీరెడ్డి

X
నటి కరాటే కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. కరాటే కల్యాణి, రాకేశ్ సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారనీ, చెన్నైలో తాను కారు, ఇల్లు కొనుక్కున్నానని అయితే, దీనిపై వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పెట్రోలు పోసి తగలబెడతామని తనను బెదిరిస్తున్నారనీ, అందుకనే పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించింది. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తమపై అసభ్యకర పోస్టులు చేసిందని ఆరోపిస్తూ నటి కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ ఇటీవల హైదరాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Next Story