ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి, ఇంటికి కేంద్ర భద్రత

by srinivas |
ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి, ఇంటికి కేంద్ర భద్రత
X

ఆంధప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరువారాలపాటు వాయిదా వేసిన నేపథ్యంలో బెదిరింపులు వస్తున్నాయని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లాకు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను ఆయన ఖండించారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి, రమేష్ కుమార్ నివాసానికి సుమారు 15 మంది కేంద్ర రక్షణ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు.

Tags : election commission office, vijayawada, nimmagadda ramesh kumar, ramesh kumar house, crpf, cisf

Advertisement

Next Story