- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పొలిటీషియన్స్ ఫెయిల్ అయ్యారు : నిఖిల్
దిశ, సినిమా : హీరో నిఖిల్ రాజకీయ నాయకుల తీరుపై ఫైర్ అయ్యారు. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో జనాలకు హెల్ప్ చేయడం మానేసి ఒకరినొకరు నిందించుకుంటున్నారని, ఈ మేరకు ప్రతీ పొలిటీషియన్ ఫెయిల్ అయ్యాడని అన్నారు. ప్రజల అవస్థలు చూస్తుంటే ఆందోళన, బాధ, కోపం అన్నీ ఒకేసారి వస్తున్నాయన్న నిఖిల్.. కళ్ల ముందే జనాలు చనిపోతుంటే ఏమీ చేయలేని దుస్థితిలో ఉండటం కన్నీరు తెప్పిస్తుందన్నారు. ఫ్రెండ్స్‌తో టీమ్‌గా ఏర్పడి మెడికేషన్, ఇంజక్షన్, ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్ విషయంలో హెల్ప్ చేస్తున్నా.. ఇది చాలదని అనిపించిందన్నారు. ఆక్సిజన్ బెడ్ కోసం అడిగిన అర్ధగంటలోనే కొందరు చనిపోవడం తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. కానీ ఇంతటి క్లిష్టపరిస్థితిలోనూ జనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం చూస్తుంటే.. మానవత్వం ఇంకా మిగిలే ఉందని అర్థమవుతోందని, ఇది నిజంగా సంతోషించే విషయమని నిఖిల్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.