బీహార్‌లో నైట్ కర్ఫ్యూ.. స్కూల్స్ క్లోజ్

by Shamantha N |
బీహార్‌లో నైట్ కర్ఫ్యూ.. స్కూల్స్ క్లోజ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా ప్రభావం క్రమంలో మే 15 వరకు స్కూల్స్, కాలేజీలు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని షాపులు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేసుకోవాలని, ఆ తర్వాత అనుమతి లేదన్నారు.

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు సాయంత్రం 5 గంటలకే మూసివేయాలన్నారు. మే 16వరకు ప్రార్థనా స్థలాలను మూసివేయాలని నిర్ణయించారు. వెడ్డింగ్‌లకు 100 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నామని, మిగతా ఫంక్షన్లకు 25 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, మాల్స్, క్లబ్స్, పార్క్‌లు, సినిమా హాల్స్‌ను క్లోజ్ చేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story