- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో నైట్ కర్ఫ్యూ మరోసారి పొడిగింపు..
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 4 వరకు ఈ కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11గం.ల నుండి ఉదయం 6గం.ల వరకు కొవిడ్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపింది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఈ మేరకు కర్ఫ్యూ సమయాల్లో సడలింపు నిర్ణయం తీసుకోవడం జరిగిందని అనిల్ కుమార్ సింఘాల్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సెప్టెంబర్ 4 వరకు రాత్రి 11గం.ల నుండి ఉదయం 6గం.ల వరకు అమలులో ఉంటుందని.. కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్లు 51 నుండి 60 మరియు భారత శిక్షా స్మృతి లోని సెక్షన్ 188, ఇతర నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ ఆదేశాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.