వరుసగా రెండో రోజు లాభాలతో ముగింపు

by Harish |   ( Updated:2020-05-20 06:03:00.0  )
వరుసగా రెండో రోజు లాభాలతో ముగింపు
X

దిశ, సెంట్రల్ డెస్క్: ప్యాకేజీ సాంత్వన చేకూర్చనప్పటికీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. బుధవారం కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన ముగిశాయి. ఆర్థిక పునరుద్ధరణ కోసం ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వనుందన్న అంచనాలతో మార్కెట్లు రెండు శాతం మేర లాభాలను చవిచూశాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఫైనాన్షియల్‌తోపాటు దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. లంచ్ తర్వాత లాభాల జోరు చూపించిన సెన్సెక్స్ 622.44 పాయింట్ల లాభంతో 30,818 వద్ద ముగియగా, నిఫ్టీ 187.45 పాయింట్లు లాభపడి 9,066 వద్ద తెరపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు మాత్రమే నష్టాల్లో కదలాడగా, మిగిలిన అన్ని సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. బుధవారం నుంచి రైట్స్ ఇష్యూ ప్రారంభమవడంతో రిలయన్స్ షేర్లు జోరుగా ట్రేడయ్యాయి. యూఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.79 వద్ద కొనసాగుతుంది.

Advertisement

Next Story

Most Viewed