భారీ లాభాలతో మొదలైన మార్కెట్లు!

by Harish |
భారీ లాభాలతో మొదలైన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ మార్కెట్లు భారీ నష్టాల నుంచి లాభాల్లోకి మారాయి. తొమ్మిదేళ్ల కనిష్టానికి పడిపోయిన మార్కెట్లు సోమావారం ప్రారంభమే భారీ లాభాలతో మొదలయ్యాయి. కరోనా వైరస్ భయంతో అంతర్జాతీయంగా మార్కెట్లన్నీ నష్టాలను చవిచూశాయి. చైనా వెలుపల కరోనా మరణాలు పెరుగుతుండటమే దీనికి కారణమని, ఈ ట్రెండ్ ఎన్నిరోజులు కొనసాగుతుందో చెప్పలేమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సెన్సెక్స్ ఏకంగా 558.88 పాయింట్ల లాభంతో 38,861 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 154.15 పాయింట్లు లాభపడి 11,355 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో సూచీలన్నీ లాభాల బాట పట్టాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, నెస్లె ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్ర బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

నేటి నుంచి ఎస్‌బీఐ కార్డులు, చెల్లింపు సేవలు ఐపీవోకు రానున్నాయి. సుమారు 500 కోట్ల విలువైన షేర్లను జారీ చేయాలని సంస్థ భావిస్తోంది. ఇప్పటికే, కార్డులు, చెల్లింపు సేవల ఐపీవో షేర్ ధర రూ. 750-755 గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అలాగే, ఎస్‌బీఐ ఉద్యోగులు ఐపీవోపై ఒక్కో షేర్‌కు రూ. 75 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed