భారీ నష్టాలను నమోదు చేసిన మార్కెట్లు

by Anukaran |   ( Updated:2020-09-04 07:27:01.0  )
భారీ నష్టాలను నమోదు చేసిన మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) వారాంతంలో భారీ నష్టాలను నమోదు చేశాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ (World Economy) కోలుకోవడానికి మరింత సమయం పడుతుందనే విశ్లేషణలతో ఆసియా మార్కెట్లు (Asian markets) రెండు వారాల కనిష్ఠానికి దిగజారాయి. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్ల (domestic markets)లో అమ్మకాలు జోరందుకున్నాయి.

అంతర్జాతీయ పరిణామాలతో మదుపర్లు (Investors) అమ్మకాలకు దిగడంతో ఈక్విటీ మార్కెట్ల (Equity markets)కు భారీ నష్టాలు తప్పలేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 633.76 పాయింట్లు నష్టపోయి 38,357 వద్ద ముగియగా, నిఫ్టీ (Nifty) 193.60 పాయింట్లు కోల్పోయి 11,333 వద్ద ముగిసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (Financial year) తొలి త్రైమాసికంలో జీడీపీ క్షీణత(GDP decline), భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు కూడా మార్కెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ (Nifty)లో అన్ని రంగాలు భారీగా క్షీణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌ (Sensex Index)లో మారుతీ సుజుకి షేర్లు (Maruti Suzuki shares) మాత్రమే లాభపడగా, మిగిలిన సూచీలన్నీ డీలాపడ్డాయి. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.

Advertisement

Next Story

Most Viewed