మళ్లీ లాభాల బాట పట్టిన సూచీలు

by Harish |
మళ్లీ లాభాల బాట పట్టిన సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లు మరోసారి లాభాల బాట పట్టాయి. ఉదయం ప్రారంభమైన సమయంలో లాభాల స్వీకరణతో నష్టాలను నమోదు చేసినప్పటికీ తర్వాత పుంజుకున్నాయి. బుధవారం అమ్మకాల దెబ్బకు డీలాపడిన మార్కెట్లు గురువారం తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యాయి. మిడ్ సెషన్ సమయంలో ఆటుపోట్లకు గురైనప్పటికీ అనంతరం జోరందుకున్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 431.64 పాయింట్లు ఎగసి 44,259 వద్ద ముగియగా, నిఫ్టీ 128.60 పాయింట్లు లాభపడి 12,987 వద్ద ముగిసింది. నిఫ్టీలో అన్ని రంగాలు పుంజుకోగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు 2 శాతం, ఫార్మా 1 శాతానికి పైగా బలపడగా, మెటల్స్ అధికంగా 4 శాతం పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, ఓఎన్‌జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రమే నష్టపోగా, మిగిలిన అన్ని సూచీలు లాభపడ్డాయి. ముఖ్యంగా టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.87 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed