సీఎస్‌ను జైలుకు పంపుతాం.. ఏపీ ప్రభుత్వానికి హెచ్చరిక

by srinivas |   ( Updated:2021-06-25 02:12:54.0  )
National Green Tribunal
X

దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్‌జీటీ చెన్నై ధర్మాసనంలో విచారణ జరిగింది. పనులను నిలిపివేయాలని ఎన్‌జీటీ గతంలో తీర్పు ఇచ్చినా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ వాసి గరిమళ్ల శ్రీనివాస్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్‌జీటీ.. తీర్పును ధిక్కరించి పనులు కొనసాగిస్తే.. చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతామని హెచ్చరించింది. పనులను నిలిపివేసి పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని ఎన్‌జీటీకి ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఎత్తిపోతల పథకం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డుు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జులై 12కు వాయిదా వేసింది.

Advertisement

Next Story