- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోతిరెడ్డిపాడుకు ఎన్జీటీ బ్రేక్
దిశ, న్యూస్‌బ్యూరో: పోతిరెడ్డిపాడు విస్తరణపై ఎన్జీటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం స్టే ఎత్తివేసేందుకు నిరాకరించినా… టెండర్ల ప్రక్రియకు మాత్రం అనుమతిచ్చింది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రవాహ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పోతిరెడ్డిపాడు పనులపై కృష్ణా బోర్డు సైతం నివేదించింది. దీంతో ఎన్జీటీ స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్జీటీ నోటీసు ప్రకారం పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యంతో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు రావని వెల్లడించింది. పనులు చేసుకునేందుకు స్టే ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేసింది.
కాగా సోమవారం దీనిపై విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. అయితే ఏపీ ప్రభుత్వానికి ఒకింత ఉపశమనం కల్పించే తీర్పునిచ్చింది. దీనికి టెండర్లు పిలిచినా తుది ఆదేశాలు వచ్చేంత వరకు పనులు చేపట్టవద్దని ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం విషయంలో పర్యావరణ అనుమతులకు సంబంధించి ఆగస్టు 11వ తేదీలోగా నివేదిక సమర్పించాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలను ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపునకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ ఎన్జీటీలో పిటిషన్ దాఖలైన నేపథ్యలో ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
కానీ ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలు చేసినా సాంకేతికమైన పనులు కొనసాగిస్తోంది. దీనికి సంబంధించిన కర్నూలు నీటిపారుదల శాఖ విభాగం పనులు, నిధులను అంచనా వేసింది. రూ. 6500 కోట్లతో తొలి దశ పనులకు అన్నీ సిద్ధం చేసింది. ఎన్జీటీ దీనిపై స్టే విధించడంతోనే టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసింది. కానీ ఇప్పుడు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని, చిన్ని చిన్న పనులు, సాంకేతికమైన పనులేమైనా ఉంటే ముందుకు పోవచ్చని ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ అనుమతిచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి కొంత ఊటర కల్గించే అంశమే అయినా పనులు చేపట్టవద్దని, ఆగస్టు 11 వరకు గడువు విధించడం కొంత నిరాశ కల్గిస్తోంది.