- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెండ్లైన ఐదో రోజే వాంతులు.. పారాణి ఆరకముందే పరలోకానికి..!
దిశ, నాగర్‌కర్నూల్: కాళ్ల పారాణి అరకముందే పెండ్లి కూతురు ప్రాణాలు విడిచింది. పెండ్లైన ఐదు రోజులకే వరుడిని విషాదంలోకి నెట్టింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంత బజార్‌లో జరిగింది. నాగర్‌కర్నూల్‌కు చెందిన శ్రీవాణి(19) ఈ నెల 14న తాండూరు వాసి నవీన్ వివాహం చేసుకుంది. ఆ తర్వాత పెండ్లి, డిన్నర్ తంతు కూడా ముగిసింది. అనంతరం మంగళవారం భార్యభర్తలు ఇరువురూ గుడిలో అభిషేకం చేసుకుని ఇంటికి చేరారు. ఇంతలోనే శ్రీవాణికి వాంతులు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ నవ వధువు తుదిశ్వాస విడిచింది. కారోనా కారణంగానే మృతి చెందిందని స్థానికులు ఆరోపిస్తుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం కాదని కొట్టిపారేస్తున్నారు. తిండి, నిద్ర సరిగ్గా లేక బీపీ డౌన్ అయి ఇలా జరిగిందని.. కొవిడ్ పరీక్షలో నెగెటివ్ వచ్చిందంటున్నారు. ఇది ఇలా ఉంటే పెండ్లి జీవితాన్ని సంతోషంగా గడపాలని అనుకున్న వరుడు.. వధువు మృతి చెందడంతో కన్నీరుమున్నీరయ్యాడు.