సుశాంత్ కేసులో మరో ట్విస్ట్..

by  |
సుశాంత్ కేసులో మరో ట్విస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్ :
సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా బీహార్, మహారాష్ట్ర పోలీసులకు ఈ కేసు విషయంలో వివాదం తలెత్తింది. మహారాష్ట్ర పోలీసులు తమ ఎంక్వైరీకి సహకరించడం లేదని సాక్షాత్తు బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్వయంగా ఆరోపణలు గుప్పించారు. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బీహార్ పోలీసులు విచారణ చేపట్టగా.. అంతకుముందే ఆ కేసు విచారణ ముంబైలో ప్రారంభమైంది. అయితే, దానికి సంబంధించిన పత్రాలు కావాలని ముంబై పోలీసులను కోరగా వారు నిరాకరించారని గుప్తేశ్వర్ పాండే తెలిపారు.

ఈ సందర్భంగా బీహార్ డీజీపీ మాట్లాడుతూ.. హీరో సుశాంత్ వాడుతున్న సిమ్ కార్డులు అతని పేరు మీద లేవని.. అందులో ఓ సిమ్ కార్డు అతని ఫ్రెండ్ సిద్ధార్థ పితాని పేరుమీద ఉందని విచారణలో వెల్లడైందన్నారు. అలాగే, సుశాంత్ బలవర్మణం విషయమై అతని మాజీ మేనేజర్ కుటుంబాన్ని కూడా విచారించామన్నారు. కాల్ డేటా ఆధారంగా కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు.

సీబీఐకి అప్పగించాలి : కేంద్రమంత్రి

సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణను సీబీఐకు అప్పగించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి ఆర్కే‌సింగ్ స్పందించారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ థాక్రే దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించలేదని ఆర్కే‌సింగ్ వెల్లడించారు. ఈ కేసులో న్యాయం జరగాలంటే సీబీఐకు అప్పగించడమే మంచిదని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.


Next Story

Most Viewed