- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కిన్ టోన్ మెజర్ చేసే..‘జోజో గ్లాస్’
దిశ, వెబ్‌డెస్క్ : ఫ్యాషన్, టెక్నాలజీ ఎప్పుడు పోటీపడుతుంటాయి. ఏ విషయంలో అని అనుకుంటున్నారా? కస్టమర్స్‌కి..కొత్త అప్‌డేట్స్ అందించడంలో..అయితే న్యూ అప్‌డేట్స్ ఉంటేనే కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. ఫ్యాషన్ రంగానికి టెక్నాలజీ తోడైతే, గొప్ప ఫలితాలు వస్తాయి. ఈ క్రమంలో వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీతో ఫ్యాషన్ రిటైలర్స్ కస్టమర్స్‌ను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం జపాన్‌కు చెందిన అతిపెద్ద ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైలర్ జోజో.. స్కిన్ టోన్ కొలిచే స్పెక్టికల్స్(కళ్లద్దాలు) విడుదల చేసింది.
బ్యూటీ, కాస్మెటిక్ విభాగాల కోసం ప్రత్యేకంగా ‘జోజో కాస్మె’ అనే న్యూ ప్లాట్‌ఫామ్ లాంచ్ చేసింది. దీంతో స్కిన్ టోన్ మెజర్ చేయడానికి ‘జోజో గ్లాస్’ అనే కళ్లద్దాలను జోజో కంపెనీ మార్చి 18న మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఈ కళ్లద్దాలను పొందడానికి ప్రీ ఆర్డర్స్ మొదలయ్యాయి. ఇవి అగ్మెంటెడ్ రియాలిటీ ఆధారంగా మన స్కిన్ టోన్ గుర్తించి, చర్మ రంగుకు దగ్గరగా ఉండే ఫౌండేషన్ షేడ్‌లను సజెస్ట్ చేస్తుంది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా మేకప్ ఎలా ఉంటుందో చూడటానికి గ్లాసెస్ సహాయం చేయగా, ఇంట్లో కూర్చునే నెంబర్ ఆఫ్ ఫౌండేషన్ ప్రొడక్ట్స్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల బోలెడంతా టైమ్ సేవ్ అవుతుందని, కస్టమర్ కూడా ప్రొడక్ట్ పట్ల సంతృప్తిగా ఉంటాడని, కాన్ఫిడెంట్‌గా కొంటాడని నిర్వాహకులు తెలిపారు. ఈ అద్దాలతో ప్రస్తుతం ఫౌండేషన్‌ను చెక్ చేయడానికి ఉపయోగిస్తున్నా, రాబోయే రోజుల్లో ఇతర సౌందర్య ఉత్పత్తులతో దీన్ని అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తామని అన్నారు. కొవిడ్ మహమ్మారి కారణంగా రిటైల్ దుకాణంలో షాపింగ్ చేయడం, మేకప్ టెస్ట్ చేయడం సాధ్యం కానప్పుడు వినియోగదారుడు ఆన్‌లైన్‌లోనే సౌందర్య సాధనాలను ఆర్డర్ చేయడం సులభం అవుతోంది. పాండమిక్ నేపథ్యంలో ఎక్కువ మంది వినియోగదారులు షాపింగ్ కోసం ఈ-కామర్స్ వైపు మళ్లడంతో, కంపెనీలు ఇలాంటి టెక్ సొల్యూషన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి.