- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో కొత్త కోణం..
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు యాక్సిడెంట్ కేసులో మరో కొత్తకోణం వెలుగుచూసింది. ప్రమాదానికి కారణమైన మందుబాబులు మూడు పబ్బుల్లో పార్టీలు చేసుకున్నట్టు గుర్తించారు. అనంతరం ఆ మూడు పబ్బుల నుంచి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. పార్టీ అయ్యాక పబ్ నుంచి బయటకు రాగానే బంజారాహిల్స్ హోటల్‌లో ఉండేందుకు రోహిత్ వచ్చాడు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత రోహిత్ అండ్ సుమన్ ఇద్దరూ పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, వీరిని పోలీసులు వెంబడించి పట్టుకున్నట్టు తెలిపారు.
నిందితులు రోహిత్ పై ఐపీసీ 304 (2) సుమన్ పై 109 కింద కేసులు నమోదు చేసినట్టు వెస్ట్ జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడమే కాకుండా వెస్ట్ జోన్ పబ్బులు, బార్‌లపై కూడా నిఘా ఉంచినట్టు వెల్లడించారు. ఇకపై ఎవరైనా మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడుతున్నారని వివరించారు. తమ పిల్లలపై పేరెంట్స్ కూడా నిఘా ఉంచాలని వెస్ట్ జోన్ జాయింట్ సీపీ సూచించారు.