కొత్త పార్టీ పేరు ప్రకటించిన మాజీ సీఎం..

by Shamantha N |
amarindar singh
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్గత విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టాడు. పంజాబ్ పీసీసీ నవజ్యోత్ సింగ్‌తో విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో అంతా అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతాడు అనుకున్నారు.. కానీ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెడుతా అని ప్రకటించాడు. రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. అయితే ఇవాళ అమరీందర్ సింగ్ తన కొత్త పార్టీ పేరును “పంజాబ్ లోక్ కాంగ్రెస్” అని పేరు పెట్టారు. అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టడంతో పంజాబ్ లో రాజకీయాలు వేడెక్కాయి.

Advertisement

Next Story