- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరద సాయంతో అధికార పార్టీకి కొత్త తలనొప్పి
దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో ప్రజల నుంచి వచ్చిన డ్యామేజీని కంట్రోల్ చేసుకోడానికి ప్రతి బాధిత కుటుంబానికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది అధికార పార్టీ.. కానీ సాయం అందించినా లభించిన ఉపశమనం మాత్రం అంతంతగానే ఉంది. చాలాచోట్ల స్థానిక అధికార పార్టీల నేతలు జోక్యం చేసుకోవడంతో పేదల నుంచి నిరసనలు వెల్లువెత్తున్నాయి. సుమారు రూ. 550 కోట్ల మేర ప్రభుత్వం ఖర్చు చేయాలని భావించినా స్థానిక నేతల జోక్యంతో ప్రజల నుంచి నిరసనలు తప్పడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ప్రజల నుంచి వ్యతిరేకతను దూరం చేసుకోడానికి పది వేల రూపాయల ఆర్థికసాయం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం ఎంతో కొంత ఆదుకుంటుందని భావించిన అధికార పార్టీకి దానికి బదులుగా విమర్శలు ఎదురుకావడం విశేషం.
గోషామహల్ నియోజకవర్గం గన్‌ఫౌండ్రి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్‌కు చెందిన బస్తీవాసులు అబిడ్స్ లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ఎదుట గురువారం సాయంత్రం ధర్నాకు దిగారు. జీహెచ్ఎంసీ అధికారులకు, స్థానిక కార్పొరేటర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. జీహెచ్ఎంసీ అధికారి ధరమ్‌సింగ్ ఉద్దేశపూర్వకంగానే తనకు అనుకూలమైనవారికే పది వేల రూపాయలను ఇస్తున్నారని, నిజమైన బాధితులకు సహాయం అందడం లేదని ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కొద్దిమందికి పదివేల రూపాయలకు బదులుగా ఐదు వేలు మాత్రమే ఇచ్చిన మిగిలినదాన్ని కమిషన్‌గా తీసుకుంటున్నారని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు అల్వాల్ వెంకటాపురం డివిజన్‌లో వరద బాధితులకు స్థానిక కార్పొరేటర్ భర్త జోక్యం చేసుకోవడం స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. అనుకూలమైన వారికే ఇస్తున్నారని, నిలదీసిన చోట పది వేల రూపాయలు ఇవ్వడానికి బదులు ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని స్థానికులు ఆరోపించారు. చివరకు ఈ నిర్వాకం స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దాకా వెళ్లడంతో స్వయంగా ఆయన రంగంలోకి దిగాల్సి వచ్చింది. స్థానిక కార్పొరేటర్ నిర్వాకం నిజమేనని నిర్ధారించుకుని స్వయంగా తాను చొరవ తీసుకుని బాధితులకు తప్పకుండా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
బాగ్ అంబర్‌పేట్ డివిజన్‌లోని పోచమ్మబస్తీలోని ప్రజలు కూడా స్థానిక కార్పొరేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కార్పొరేటర్ తనకు ఇష్టమైన వాళ్లకి ఇస్తున్నారని, నిజమైన బాధితులకు ఇవ్వడంలేదని వాపోయారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. నగరంలోని చాలా ముంపు ప్రాంతాల్లోని మురికివాడలు, పేదల బస్తీల్లో ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం కొన్నిచోట్ల పూర్తి స్థాయిలో అందడంలేదు. మరికొన్నిచోట్ల సగం మాత్రమే ఇచ్చి మిగిలినదాన్ని నొక్కేస్తున్నారు.