నూతన విద్యావిధానంపై ఉపరాష్ట్రపతి ప్రశంస..

by Anukaran |   ( Updated:2020-08-06 12:12:43.0  )
నూతన విద్యావిధానంపై ఉపరాష్ట్రపతి ప్రశంస..
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. రాజలక్ష్మి పార్థసారథి మొదటి స్మారకోపన్యాసంలో ఆన్ లైన్ వేదిక ద్వారా ఆయన ప్రసంగించారు. నూతన విద్యావిధానం విద్యార్థి సమగ్రాభివృద్ధికి లభించిన ఓ దార్శనిక పత్రమని ఆయన అభివర్ణించారు. విద్యార్థి కేంద్రిత నూతన విధానం ద్వారా పోటీ ప్రపంచానికి అనుగుణంగా భవిష్యత్ భారతాన్ని సిద్ధం చేసేందుకు వీలవుతుందన్నారు.

పాఠ్యప్రణాళికలో తీసుకురానున్న మార్పులతో విద్యార్థులపై భారం తగ్గుతుందన్నారు. విద్యార్థుల్లో బాల్యం నుంచే చదువులతోపాటు ఆట పాటలు, శారీరక శ్రమపైనా సమాన దృష్టి కేంద్రీకరించాలని వెంకయ్య సూచించారు. విద్యార్థులు కూడా తరగతి గదులతో సమానంగా క్రీడా మైదానాల్లో సమయం ఎక్కువగా వెచ్చించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed