- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘రైతు శ్రేయస్సు కోసమే నూతన వ్యవసాయ విధానం’
by Aamani |
X
దిశ, అదిలాబాద్: దేశంలో ఎక్కడ లేనివిధంగా రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానాన్నిఅమలు చేస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.ఆదివారం ఆదిలాబాద్ జడ్పీ కార్యాలయంలో నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై జరిగిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరూ నియంత్రిత సాగు విధానం వైపు మొగ్గు చూపేలా జిల్లా యంత్రాంగం కృషి చేయాలన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలనే సాగుచేయాలని రైతులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ భోజారెడ్డి, డీసీసీబీ చైర్మన్ నాందేవ్ పాల్గొన్నారు.
Advertisement
Next Story