సెవెన్ డిఫరెంట్ లుక్స్‌తో చియాన్ 'కోబ్రా'

by Shyam |
సెవెన్ డిఫరెంట్ లుక్స్‌తో చియాన్ కోబ్రా
X

చియాన్ విక్రమ్, డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కోబ్రా. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రహమాన్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో సెవెన్ డిఫరెంట్ లుక్స్‌తో అదరగొట్టేశాడు విక్రమ్. మల్టీ రోల్స్ చేయడం విక్రమ్‌కు కొత్తేమీ కాకపోయినా… ప్రయోగాలు మాత్రం బెడిసి కొడుతూనే ఉన్నాయ్. కానీ ఈ సినిమా లుక్స్‌లో సెవెన్ డిఫరెంట్ ఏజెస్‌లో కనిపించిన విక్రమ్… అన్నిటిలోనూ వేరియేషన్ చూపించాడు. వీరిలో ఒకరినొకరు సైంటిఫిక్‌గా కనెక్ట్ అయి ఉంటారనే సమాచారం ఉండగా… సినిమాలో 20 డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడట విక్రమ్. దశావతారంలో కమల్ హాసన్ పది పాత్రలు చేయగా… కమల్‌ను ఇన్సిపిరేషన్‌గా తీసుకున్న విక్రమ్ కోబ్రాలో 20 పాత్రలు చేస్తున్నారు. దీంతో చియాన్ ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. సినిమా సక్సెస్ అయితే మాత్రం ఇంటర్నేషనల్ లెవల్‌లో రికార్డులు బద్ధలు కావడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.

కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి లేడీ లీడ్ రోల్ చేస్తుండగా… క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ టర్కిష్ ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా కనిపించనున్నారట. డైరెక్టర్ రవికుమార్, ఆనంద్ రాజ్, మాముక్కొయా, మిర్ణాలిని రవి, మహ్మద్ అలి బయీగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారట. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా…. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ సినిమా నిర్మిస్తున్నారు. కాగా మే 2020లో కోబ్రా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మూవీ యూనిట్.

Advertisement

Next Story