- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనమ్ కాస్త బాధ్యతాయుతంగా ఆలోచించు : నెటిజన్లు
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ సోషల్ మీడియా పోస్ట్ నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పించింది. బాలీవుడ్ సెలబ్రిటీలలో సింగర్ కనికా కపూర్ ఫస్ట్ కరోనా పాజిటివ్ కేసు కాగా … ఆమె విదేశాల నుంచి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఐసొలేషన్ చేసుకోకుండా పార్టీలు చేసుకోవడం… ఇతరులను కూడా కరోనా బారిన పడేసే అవకాశం ఉండడంతో ఆమెపై విమర్శలు చేశారు చాలా మంది ప్రముఖులు, సామాన్యులు. ఐతే సోనమ్ మాత్రం కనికా కపూర్ మార్చి 9న విదేశాల నుంచి తిరిగొచ్చింది అని.. ఆ సమయంలో భారతదేశంలో హోలీ వేడుకలు జరుపుకున్నామని… ఎవరు కూడా వేడుకులకు దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోలేదని పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు ఆమె పై మండిపడుతున్నారు. రాంగ్ టైమ్ లో రాంగ్ పోస్ట్ పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న సోనమ్ ప్రవర్తన బాధ్యతారాహిత్యంగా ఉందని విమర్శిస్తున్నారు. కోవిడ్ 19 వ్యాధి గురించి అవగాహన కల్పించాల్సినది పోయి… ఇలాంటి రాంగ్ స్టేట్ మెంట్ ఇస్తుందని ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా ఉన్నారని.. బాధ్యతాయుతంగానే ప్రవర్తించారని తెలుసుకోవాలని సూచించారు నెటిజన్లు.
ఐతే దీనిపై స్పందించిన సోనమ్… నేను ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చేలా పోస్ట్ పెట్టలేదని వివరించింది. భారత్ లో కరోనా వ్యాప్తి నివారించేందుకు ప్రభుత్వం చేసిన సూచనలు పాటిస్తున్నానని తెలిపింది. స్వీయ నిర్బంధంలో ఉంటూ జాగ్రత్తలు తీసుకుం టున్నానని చెప్పింది. ఒకరిని పాయింట్ చేసి మాట్లాడడం చాలా ఈజీగా ఉంటుంది అని… అలాంటివి మానుకోవాలని సూచించింది. ఈ సమయంలో ఇతరుల పట్ల సున్నితంగా ఉండడం, సానుభూతి చూపించడం అనేది చాలా ముఖ్యమని అభిప్రాయపడిన సోనమ్… మీరంతా కూడా దీనికి మధ్ధతు ఇస్తారనే అనుకుంటున్నాను అని చెప్పింది.
Tags:Sonam kapoor, Social media, Covid19, Corona Virus, Netizens