- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓవర్ యాక్టింగ్ చాలు.. నేషనల్ క్రష్‌పై నెటిజన్ల ట్రోల్స్
దిశ, సినిమా : సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేయడమంటే మామూలు విషయం కాదు. గ్లామర్ ఇండస్ట్రీలో హీరోయిన్లకైతే మరీ కష్టం. వారి ప్రతీ మూమెంట్ క్యాప్చర్ అవుతూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం కొవిడ్ నిబంధనలు పాటించే విషయంలోనూ సెలబ్రిటీలను క్లోజ్‌గా వాచ్ చేస్తుంటారు నెటిజన్లు. ఈ క్రమంలో పబ్లిక్‌లో ఏ చిన్న తప్పు చేసినా ట్రోలింగ్‌కు గురికాక తప్పదు. ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందాన విషయంలోనూ అదే జరిగింది.
బాలీవుడ్ మూవీస్ షూటింగ్ కోసం ముంబైకి మాకాం మార్చిన ఈ కన్నడ బ్యూటీ.. కారు దిగి బయటికొస్తూ మాస్క్ ధరించలేదని గుర్తొచ్చి ముఖాన్ని చేతులతో కవర్ చేసే ప్రయత్నం చేసింది. వెంటనే తన పర్సనల్ స్టాఫ్ ఇచ్చిన మాస్క్ పెట్టుకుని ఫొటోగ్రాఫర్లతో ఇంటరాక్ట్ అయింది. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఏమంత ఆశ్చర్యం లేకున్నా.. ఆ టైమ్‌లో తను ఇచ్చిన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ పట్ల రష్మికను ‘ఓవర్‌యాక్టింగ్ కీ దుకాణ్’ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పైగా తన అటెండెంట్ బ్లూ కలర్ మాస్క్ ఇస్తే.. ఫొటోగ్రాఫర్లతో మాట్లాడేటపుడు బ్లాక్ కలర్ మాస్క్‌లో కనిపించడాన్ని ‘డ్రామా’గా కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌లో ‘గుడ్‌బై’తో పాటు ‘మిషన్ మజ్ను’ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.