- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉమెన్స్ డే స్పెషల్ : నెట్‌ఫ్లిక్స్ ‘స్త్రీ’మింగ్.. వీడియో వైరల్
దిశ, సినిమా: పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఫిమేల్ క్యారెక్టర్స్‌కు గౌరవమిస్తూ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ‘స్త్రీ’మింగ్ పేరుతో వీడియో షేర్ చేసింది. ‘పిట్టకథలు, లస్ట్ స్టోరీస్, ఢిల్లీ క్రైమ్, షి, ల్యూడో’ లాంటి సిరీస్‌ల క్యారెక్టర్స్‌తో కూడిన యూనిక్ వీడియోను రూపొందించి.. అందులో ఉమెన్ పవర్ అండ్ ఇంపార్టెన్స్, లైఫ్ ఆఫ్ సింపుల్ ఉమెన్ గురించి వివరించింది.
‘మా ప్రతీ కథ కూడా ఆమె గురించే.. తను పర్‌ఫెక్ట్ అండ్ ఇంపర్ఫెక్ట్. సన్‌షైన్, ప్యూర్ మ్యాడ్‌నెస్. తన రిథమ్‌కు తగినట్లుగా ప్రపంచం మొత్తం ఆమెతో డ్యాన్స్ చేస్తుంది. స్టుపిడ్ స్మైల్స్, స్క్రీమింగ్ నైట్స్, డిఫికల్ట్ గుడ్ బైస్ అన్నీ ఎదుర్కొంటుంది. బతకడం తనకో యుద్ధం. తనో రూల్ బ్రేకర్, గేమ్ చేంజర్. కానీ ఆమె జస్ట్ ప్రేమతో కూడిన పలకరింపు కోరుకుంటుంది. మీరు తన గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే రండి.. ఆమె ఒక కథ దూరంలో మాత్రమే ఉంది’ అంటూ వీడియోను షేర్ చేసింది ఓటీటీ ప్లాట్‌ఫామ్.
Women (n):
There were no words we could find to describe all of them in a dictionary. So here's to them, and anything they choose to be.#NowStreeming, always streeming. pic.twitter.com/BYguaT1K85— Netflix India (@NetflixIndia) March 6, 2021
కాగా నెట్‌ఫ్లిక్స్ హెడ్ ఆఫ్ గ్లోబల్ టీవీ బెల బెజారియా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ప్రకటన చేశారు. ఐదు మిలియన్ డాలర్ల క్రియేటివ్ ఈక్విటీ ఫండ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న మహిళలను ప్రోత్సహించేందుకు, వారి అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలిపారు.