- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరు రోటరీ క్లబ్ ఉచిత అన్నదానం
నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. ఇళ్ల నుంచి బయటకు వస్తే పోలీసులు శిక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధికి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న పేదలు, భిక్షాటకులు, వలస కార్మికులకు గత నెల 21 నుంచి రోటరీ క్లబ్ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తోంది.
ఆర్టీసీ బస్టాండ్ పక్కనున్న రోటరీ క్లబ్ ఆవరణలో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రతి రోజూ సుమారు 200 మంది నిరుపేదలు భోజనం చేస్తున్నారని రోటరీ క్లబ్ నిర్వాహకులు తెలిపారు. లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో మే 3వ తేదీ వరకు వితరణ కొనసాగుతుందని అన్నారు.
పేదలకు భోజన సౌకర్యం కల్పించేందుకు దాతల సహాయం తీసుకుంటున్నామని రోటరీ క్లబ్ కార్యదర్శి కేవీ చలమయ్య తెలిపారు. కేవలం ఆహారంతోనే సరిపెట్టకుండా వారికి మంచినీళ్లు, బిస్కెట్లు వంటివి కూడా అందజేస్తున్నామని ఆయన చెప్పారు. కాగా, రోటరీ క్లబ్ ఆఫ్ నెల్లూరు బ్లడ్ బ్యాంక్ సేవలు, ఉచిత నేత్ర పరీక్షలు, ఉచిత వైద్యపరీక్షలు నిర్వహిస్తూ పేదలకు దశాబ్దాలుగా సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.
tags: nellore, nellore rotary club, free food distribution