మానవత్వం చాటిన ఎస్సై అశోక్ కుమార్ రెడ్డి..

by Sridhar Babu |
nelakonda palli
X

దిశ,పాలేరు: కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ మహిళను నేలకొండపల్లి ఎస్సై అశోక్ కుమార్ రెడ్డి తన వెహికిల్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే నేలకొండపల్లి మండలం గువ్వల గూడెం గ్రామ సమీపంలోని గంగమ్మ గుడి వద్ద తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడు గ్రామానికి చెందిన కూసం దుర్గ(38) అనే మహిళ పురుగుల మందు తాగి రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడిపోయి ఉంది. సదరు మహిళ పురుగుల మందు తాగిన విషయం తెలుసుకున్న స్థానికులు నేలకొండపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్సై అశోక్ కుమార్ రెడ్డి హుటాహుటిన తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

సదరు మహిళను ఎస్సై తన వెహికిల్ లో నేలకొండపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యాధికారికి ఎస్సై ముందుగానే తెలియజేయడంతో సిద్ధంగా ఉన్న సిహెచ్సి డాక్టర్ రాజేష్ ఆసుపత్రిలో వెంటనే వైద్య చికిత్స ప్రారంభించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా కుటుంబ కలహాల నేపధ్యంలోనే ఆత్మహత్యా యత్నంకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్యయత్నానికి మరేదైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది. దీనితో ఎస్సై చేసిన సేవను మండల ప్రజలు అభినందిస్తూ.. కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed