- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్‌కు ‘నైబర్ హుడ్’ హీరో అవార్డు
దిశ, న్యూస్‌బ్యూరో: సింగరేణి అభివృద్ధికి విధుల నిర్వహణలో ప్రతిభ చూపడంతో పాటు పర్యావరణహిత చర్యలు, సమాజసేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పనిచేస్తూ ప్రశంసలందుకొంటున్న సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.బలరాం (ఐ.ఆర్.ఎస్.)ను హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు వారు ‘అవర్ నైబర్ హుడ్’ హీరో అనే అవార్డుతో సత్కరించారు. హైదరాబాద్‌లో సింగరేణి భవన్‌లో మంగళవారం హెచ్.డి.ఎఫ్.సి అధికారులు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జోనల్ హెడ్ సౌత్ విశాల్ భాటియా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సర్కిల్ హెడ్ బ్రది విశాల్‌లు ఎన్.బలరాంను శాలువ, పుష్పగుచ్చాలతో సన్మానించి సైటేషన్‌ను బహుకరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలరాం కంపెనీకి లాభం చేకూర్చే పలు చర్యలు చేపట్టారనీ, పర్యావరణ హితం కోరి ఆయన ఒక్కరే 6,500 మొక్కలను సింగరేణికి చెందిన పది ప్రాంతాల్లో నాటడం, అలాగే తన స్వగ్రామంలో మరో 5,000 మొక్కలు నాటడం చాలా గొప్ప విషయమని ప్రశంసించారు. అనేక సమాజహిత కార్యక్రమాలు, సంఘసేవా కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొంటారు కనుక తమ పొరుగున ఉన్న హీరోగా ఆయన్ను గుర్తిస్తూ ఈ అవార్డును అందజేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బలరాం మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేయడం చాలా గొప్ప అవకాశం, గొప్ప అదృష్టమనీ, రాష్ట్రానికి వెలుగు పంచే సింగరేణిలో తాను కూడా ఒక సభ్యుడిగా ఉండడం ఎంతో ఆనందం కల్గిస్తుందని అన్నారు. తన సేవకు గుర్తింపుగా అవార్డును బహుకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్.డి.ఎఫ్.సి డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చక్రవర్తి, రిలేషన్ షిప్ మేనేజర్ అనిల్ నాదెళ్ల, సింగరేణి పి.ఆర్.ఓ. బుడగం మహేష్ పాల్గొన్నారు.