దుమ్ములేపుతున్న అధికారులు.. కాంట్రాక్టర్ సార్ కనికరించరా.?

by Shyam |
దుమ్ములేపుతున్న అధికారులు.. కాంట్రాక్టర్ సార్ కనికరించరా.?
X

దిశ,చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడలపేట నుంచి మొగుళ్లపల్లి వరకు చేపట్టిన డబుల్ రోడ్డు నిర్మాణ పనులు నత్తకే నడకను నేర్పుతున్నాయి. సుమారు 28 కోట్ల నిధులు వెచ్చించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. జడలపేట నుంచి రామచంద్రపూర్ వరకు రోడ్డు విస్తరణ పూర్తి కాగా చిట్యాల మండలకేంద్రం నుంచి ఇటీవలే కాంట్రాక్టర్ పనులను మొదలుపెట్టారు. అయితే ఈ రహదారిలో కంకర రోడ్డు వేసారు. ఇప్పటికీ ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఆ రోడ్డులో విపరీతంగా దుమ్ము లేస్తోంది. అయితే దుమ్ము లేవకుండా ఉండేందుకు గాను కాంట్రాక్టర్‌ ఆ కంకర రోడ్డుపై నీటిని సైతం చల్లడం లేదు. దీంతో స్థానిక ప్రజలు, వాహచోదకులు ఆ దుమ్ముతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న వారికి ఆ దుమ్ము కండ్లలో చేరడంతో నానాఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్‌ మాత్రం ఆ కంకర రోడ్డుపై నీటిని సైతం చల్లడంలేదు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది.

కంకర రోడ్డుపై నీటిని చల్లని కాంట్రాక్టర్‌

చిట్యాల నుంచి మొగుళ్లపల్లి వరకు చేపట్టిన ఈ రోడ్డులో కంకర పోశారు. అయితే ఆ పనులు కొనసాగుతుండటంతో ఆ రోడ్డుపై వీపరితంగా దుమ్ము లేస్తోంది. దుమ్ము లేవకుండా కాంట్రాక్టర్‌ నీటిని చల్లడం లేదు. దీంతో ఆ రహదారి వెంబడి ఉన్న ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కంకర రోడ్డుపై నీటిని చల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పట్టించుకోని అధికారులు..

కట్కూరి రాజు,చిట్యాల గ్రామస్థుడు

ఆ దుమ్ముతో స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్లు షాపులపై దుమ్ము చేరుతోంది. అదే విధంగా కంకర రోడ్డుపై వెళ్తున్నప్పుడు ద్విచక్రవాహనాలు పంక్షచర్‌ అవుతున్నాయి. ఇప్పటికైనా వాహనదారులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కాంట్రాక్టర్లు త్వరగా పనులు పూర్తిచేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed