ఆ ఇద్దరితో అందుకే బ్రేకప్: నయన్

by Shyam |
ఆ ఇద్దరితో అందుకే బ్రేకప్: నయన్
X

నయనతార… ప్రేక్షకుల నయనాలకు తన అందంతో ఆనందాన్నిచ్చే తార. అభినయం, అందం కలబోసిన నయన్… ఒక పాత్ర చేసిందంటే వంద శాతం న్యాయం చేస్తుంది. అందుకే ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. కానీ ఈ సూపర్ స్టార్ రెండు సార్లు ఫెయిల్ అయింది. అదే ప్రేమలో. శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం నడిపిన భామ… రెండు సార్లు దెబ్బతింది. ఆ డిప్రెషన్ నుంచి మళ్లీ నన్ను బయట పడేసింది సినిమాలే అన్నారు. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదని… అందుకే విడిపోవాల్సి వచ్చిందని చెప్పింది. అయితే ఎన్ని గడ్డు పరిస్థితులు ఏర్పడినా… అభిమానులు మాత్రం తనకు ఎప్పుడూ అండగా నిలిచారని తెలిపింది నయన్.

ప్రస్తుతం డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న నయనతార… త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అని సమాచారం. కాగా నయన్… అటు తమిళ్ ఇటు తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. మూడు పదుల వయస్సులోనూ క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ… హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తోంది.

tags :Nayanthara, Simbu, Prabhudeva, Vignesh Shivan

Advertisement

Next Story

Most Viewed