- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఆకారం మీకు వికారమా?
దిశ, వెబ్ డెస్క్: నా ఎదురుగా ఉన్న నలుగురిలో నేనే ఎందుకు భిన్నంగా ఉన్నాను? ఇది నాకే ఎందుకు ఇలా వచ్చింది? ప్రయత్నాలెన్ని చేసినా ఎందుకు ఫలితం ఉండడంలేదు? అని బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే చూడండి..
చాలా మంది అధిక పొట్ట సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీని కారణంగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొంతమంది అయితే అందహీనంగా కూడా కనిపిస్తారు. అంతేకాదు.. పొట్టను తగ్గించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా తగ్గకపోవడంతో వాళ్లు ఎప్పుడు చూసినా దాని గురించే అంతర్మథనం చెందుతూ ఉంటారు. అయితే.. దీనిని దృష్టిలో పెట్టుకున్న పలువురు నిపుణులు పొట్ట తగ్గించేందుకు పలు సూచనలు చేస్తున్నారు. అవేంటో మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడొచ్చంట. అయితే.. ఇంకెందుకు మరి ఆలస్యం.. అవేంటో తెలుసుకోండి.
బొజ్జ లేకుండా ఉంటే మనం బట్టలు వేసుకున్నా.. ఆభరణాలు పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తాము. కానీ, మనకు బొజ్జ ఉంటే మనకు మనం అద్దంలో చూసుకుంటే మనకు మనమే నచ్చం. ఎందుకంటే ఆ ఆకారం వెరైటీగా ఉంటది. అంతేకాదు అది చాలా సమస్యలకు దారి తీస్తది. అందుకే బొజ్జ ఉంటే ఎవ్వరికీ నచ్చదు. అయితే.. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే అధికంగా ఆహారం తీసుకోవడం లేదా అధికంగా మద్యం తీసుకోవడం వల్ల వస్తది. శరీర కెపాసిటీ కంటే అధికంగా తీసుకుంటే అధిక పొట్టగా మారడానికి కారణమవుతుందని వైద్యులు అంటున్నారు.
అయితే.. సరిగ్గా 30 రోజులపాటు ఓ నియమంలో భాగంగా ప్రతి రోజూ నిర్ణయించిన నేచురల్ ఫుడ్ తీసుకుంటే పొట్ట తగ్గడం ఖాయం. అంతేకాదు.. దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. మీరు అప్పుడే పుట్టిన బిడ్డలా ఎప్పుడు చూసిన ఆనందం, ప్రశాంతత మీ సొంతమవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
మొదటగా మీరు ఉదయం లేవగానే లీటర్ లేదా లీటర్ పైగా మంచినీళ్లు తాగాలి. ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవాలి. అనంతరం గంటన్నరపాటు పొట్ట తగ్గే ఆసనాలు వేయాలి. అందులో భాగంగా ఎక్కువ సూర్య నమస్కారాలు చేయాలి. సుమారు రోజుకు 100 వరకు సూర్యనమస్కారాలు చేయాలి. ఉత్తానపాపదసన్, నౌకాసన్ లు రోజూ ఉదయం, సాయంత్రం 3 సార్లు చేయాలి. అలా చేస్తే చాలా ప్రయోజనం మీ సొంతమవుతుంది. ఇలా ఆసనాలు పూర్తయినంక రెండోసారి లీటర్ కు పైగా నీళ్లు తాగాలి. ఈ ప్రక్రియంతా కూడా ఉదయం 9.30 గంటల్లోపు జరగాలి. ఆ తర్వాత ఉదయం 9.30 నుంచి 10 గంటలకు 250 ఎంఎల్ వెజిటేబుల్ జ్యూస్ లేదా పండ్ల జ్యూస్ తీసుకోవాలి. ఆ తర్వాత గంటపాటు రెస్ట్ తీసుకోవాలి.
పై ప్రక్రియ అనంతరం లంచ్ ప్రారంభమవుతుంది. అదేంటంటే.. ఉదయం 11 నుంచి 12 మధ్య మీరు పెసర బొబ్బెర్ల వంటి మొలకలను తీసుకోవాలి. వాటిలో దానిమ్మ గింజలు, కిస్మిస్, ఖజ్జూరాలు కలుపుకుని తీసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక పండు తినాలి. దీంతో మీకు లంచ్ అయిపోతుంది.
పై ప్రక్రియ అనంతరం సా. 4 గంటల వరకు నీళ్లు తాగుతూ ఉండాలి. ఆ తర్వాత సాయంత్రం 4.30 కి ఫ్రూట్ జూస్ తాగాలి లేదా కొబ్బరి నీళ్లు తాగాలి. దీంతో మీరు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు.
ఇక 5.30 నుంచి 6 గంటలకు మీరు పది లేదా పదిహేను నానబెట్టిన బాదం పప్పులు, వాల్ నట్స్, జీడి పప్పులు, ఎండు ఖజ్జురాలు కలిపి తీసుకోవాలి. ఆ తర్వాత బొప్పాయి లేదా అరటి పండు లేదా జామపండు, పుచ్ఛకాయ తీసుకోవాలి. దీంతో మీ డిన్నర్ పూర్తయినట్టే. ఉడికిన ఆహారం తీసుకోకుండా మీరు ఇలా రోజు చేస్తే బ్రహ్మాండంగా ఫ్యాట్ తగ్గుతుంది.
ఇలా చేస్తూ మీరు పదిహేను రోజుల తర్వాత సోడియం-పొటాషియం బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు అందులో 135 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. ఒకవేళ తగ్గితే మీరు కొబ్బరి నీళ్లు తీసుకుంటే సరిపోతుంది.
ఇలా మీరు నెల రోజుల పాటు చేస్తే మీ పొట్ట తగ్గడమే కాదు.. ప్రశాంతంగా నిద్ర పడుతుంది. మెదడు బాగా పని చేస్తుంది. నోటి దర్వాసన ఉండదు. ఇలా ఒక్కటేమిటో ఎన్నో స్వప్రయోజనాలు మీ సొంతమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
సో.. ఇంకెందుకు మరి ఆలస్యం. ఇలా ఒక నెలపాటు ట్రై చేయండి.. మీ పొట్టను తగ్గించుకోండి.
Tags: High stomach problem, natural diet, fruits, nuts, fresh water, specialists