Zakir Hussain: శోకసంద్రంలో సంగీత ప్రియులు.. తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత

by Shiva |
Zakir Hussain: శోకసంద్రంలో సంగీత ప్రియులు.. తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్‌ హుస్సేన్‌ (Zakir Hussain) (73) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన అమెరికా (America)లోని శాన్‌ ‌ఫ్రాన్సిస్కో (San Francisco) ఆసుపత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. జాకీర్ హుస్సేన్ పూర్తి పేరు జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషి. 1951 మార్చి 9న ముంబై (Mumbai)లో ఆయన జన్మించారు. ప్రముఖ తబలా విద్యాంసుడు ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ తనయుడే జాకీర్ హుస్సేన్ (Zakir Hussain).

తబలా విద్వాంసుడిగా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జాకీర్ హుస్సేన్‌కు అభిమానులు ఉన్నారు. ఏడేళ్ల ప్రాయంలోనే ఆయన తబలా వాయించడంలో నిష్ణాతుడయ్యాడు. 12 ఏళ్లు వచ్చేసరికి దేశమంతటా తన ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నాడు. భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఎనలేని సేవ చేసిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం నుంచి 1988లో పద్మశ్రీ (Padma Sri), 2022లో పద్మ విభూషణ్ (Padma Vibhushan) వంటి ప్రతిష్హాత్మక పురస్కారాలు వరించాయి. జాకీర్ హుస్సేన్ (Zakir Hussain) తన అసాధారణ తబలా నైపుణ్యంతో పలు భారతీయ, అంతర్జాతీయ సినిమాలకు కూడా పని చేశారు. సుమారు 40 ఏళ్ల కిందట జాకీర్ హుస్సేన్ (Zakir Hussain) కుటుంబంతో సహా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో స్థిరపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed