India Bloc: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు ఆందోళనకరం: ఇండియా కూటమి

by S Gopi |
India Bloc: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు ఆందోళనకరం: ఇండియా కూటమి
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌లో ఆశ్రయం పొందడంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలోనే ఆ దేశంలోని హిందువులతో పాటు మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని తొలగించిన తర్వాత హిందూ సమాజంపై జరిగిన దాడులను ప్రియాంక గాంధీ వాద్రా, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్ సహా పలువురు ఇండియా కూటమి నేతలు ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్.. బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్‌ యూనస్‌ సెక్యులర్‌ నాయకుడని, దేశంలో హిందువులపై హింస పెచ్చుమీరుతున్నందున వర్గాల మధ్య చీలికలను నివారించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. తనకు తెలిసి యూనస్ విద్యావంతుడు, వివిధ సంఘాలు, భాషా సమూహాల మధ్య చీలికలు లేకుండా పని చేస్తారనే నమ్మకం ఉందన్నారు. బంగ్లాదేశ్ సంతులిత వైఖరిని అవలంబించాలి. యూనస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో పరిస్థితి మెరుగుపడవచ్చని' పవార్ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులపై హింసను ఖండిస్తూ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎక్స్‌లో పోస్ట్ చేసారు. 'పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై నిరంతర దాడులకు సంబంధించిన వార్తలు కలవరపెడుతున్నాయి. మతం, కులం, భాష లేదా గుర్తింపు ఆధారంగా వివక్ష, హింస, దాడులు ఏ నాగరిక సమాజంలోనూ ఆమోదయోగ్యం కాదు.

Advertisement

Next Story