మహిళల కదలికలపై నిఘా ఉంచారా? అమిత్ షాకు ప్రియాంక గాంధీ కౌంటర్

by S Gopi |
మహిళల కదలికలపై నిఘా ఉంచారా? అమిత్ షాకు ప్రియాంక గాంధీ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియంక గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాంగా అమిత్ షా గాంధీ కుటుంబసభ్యులు ఎన్నికల సమయంలో మాత్రమే అమేఠీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని విమర్శించారు. దీనికి బదులిచ్చిన ప్రియాంక గాంధీ వాద్రా.. ఆయన మాటలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. మహిళల కదలికలపై అమిత్ షా నిఘా ఉంచారా? కొద్దిరోజుల క్రితం నేను నా కూతురిని చూసేందుకు థాయ్‌లాండ్ వెళ్లాను. తన థాయ్‌లాండ్ పర్యటన సమాచారం గురించి ఆయనకు ఎలా తెలుసునని ప్రశ్నించారు. ముఖ్యంగా మహిళలు ఏం చేస్తున్నారు, ఎప్పుడు, ఎక్కడ ఉన్నారు అనే వాటిపై ఆయన దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. నేను థాయ్‌లాండ్ వెళ్లిన సమాచారం ఎవరు చెప్పారో అమిత్ షా చెప్పగలరా? ఆయన దగ్గర సమాచారం ఉన్నప్పుడు అబద్దాలు చెప్పాల్సిన పనేమిటి? అని నిలదీశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ హయాంలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేశామని, ఎయిమ్స్, నిఫ్ట్, ఎఫ్‌డీడీఐ, ఐదు జాతీయ రహదారులు, 8 ఫ్లైఓవర్లు, రైల్వే వాషింగ్ లైన్, 10 రైల్వే అండర్ పాస్‌లు సహా అనేక చేశామని ప్రియాంక గాంధీ చెప్పారు. రాయ్‌బరేలీకి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పగలరా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed