Houthi : 24 గంటల్లోనే రెండు సార్లు.. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ పై హౌతీల దాడులు

by Shamantha N |   ( Updated:2025-03-17 14:18:45.0  )
Houthi : 24 గంటల్లోనే రెండు సార్లు.. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ పై హౌతీల దాడులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దాదాపు 24 గంటల్లోనే అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ పై హౌతీలు దాడులకు తెగబడ్డారు. సోమవారం వారు రెండుసార్లు అమెరికా విమాన వాహక నౌకా బృందంపై దాడులు చేసినట్లు హౌతీలు వెల్లడించారు. అమెరికా దాడులకే ప్రతిదాడులు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 18 క్షిపణలు, డ్రోన్లను యూఎస్‌ఎస్‌ హారీ ట్రూమన్‌, దాని సహాయ నౌకలే లక్ష్యంగా చేసుకొని మిసైల్స్ ప్రయోగించినట్లు చెప్పారు. ఆ తర్వాత కొన్ని గంటలకు మరోవిడత తాము దాడి చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం టెలిగ్రామ్‌ ఛానెల్‌లో హూతీల ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికన్లపై ప్రతిదాడులు కొనసాగుతాయన్నారు. ఇక అమెరికా వర్గాలు మాత్రం హూతీలు ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను కూల్చేసినట్లు ప్రకటించారు.

ఇజ్రాయెల్ నౌకపై విరుచుకుపడ్డ అమెరికా

మరోవైపు, హూతీ రెబల్స్‌ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెల్‌ నౌక ది గెలాక్సీ లీడర్‌పై అమెరికా విరుచుకుపడింది. ఈ నౌకలోని కమాండ్‌ పోస్టు అమెరికా దాడిలో ధ్వంసమైందని సబా న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. అమెరికా నిర్వహించిన ఎయిర్ స్ట్రయిక్ లో వీటిని లక్ష్యంగా చేసుకొన్నట్లు తెలిపింది. అమెరికా ఇప్పటివరకు నిర్వహించిన దాడుల్లో 53 మంది చనిపోగా.. 98 గాయపడినట్లు హూతీల ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో చాలామంది పిల్లలు, మహిళలు ఉన్నట్లు చెబుతుంది. అంతేకాకుండా ఆదివారం రాత్రి అమెరికన్లు ఓ కాటన్‌ జిన్నింగ్‌ ఫ్యాక్టరీపై దాడి చేసినట్లు అమెరికా తెలిపింది. యెమన్‌లో ఆపరేషన్‌ కొనసాగుతోందని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఆదివారం రాత్రి వెల్లడించింది. ఇక యెమన్‌లు మొత్తం దేశ రక్షణరంగంలోకి దిగాలని హూతీ నేత అబ్దుల్‌ మాలిక్‌ అల్‌హూతీ పిలుపునిచ్చారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి మాత్రం ఇరుపక్షాలు సైనిక చర్యలను నిలిపివేయాలని కోరింది.

Read More..

Viral Video: ఇది చాలా ఇంటెలిజెంట్ కోతి.. లక్ష విలువ చేసే వస్తువు ఎత్తుకెళ్లి మరీ.. ఏం చేసిందంటే?

Next Story

Most Viewed