కంచన్ జంగా రైలు ప్రమాదం.. లోకో పైలట్ కు క్లీన్ చీట్

by Shamantha N |
కంచన్ జంగా రైలు ప్రమాదం.. లోకో పైలట్ కు క్లీన్ చీట్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి గూడ్స్‌ రైలు ఢీకొంది. ఈ ఘటనపై విచారణ జరిపిన రైల్వే సేఫ్టీ కమిషనర్(సీఆర్ఎస్) గూడ్స్‌ రైలు లోకో పైలట్‌ కు క్లీన్ చీట్ ఇచ్చింది. గూడ్స్ రైలు డ్రైవర్ సిగ్నల్‌లను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ప్రమాదం సంభవించిందని నివేదికలో పేర్కొంది. ఆటోమేటిక్ సిగ్నల్ ఫెయిల్యూర్స్ కింద రైలు కార్యకలాపాల నిర్వహణలో బహుళ స్థాయిలలో లోపాలు ఉన్నాయని తెలిపింది. ఇది ప్రమాదానికి దారితీసింది అని రైల్వే సేఫ్టీ కమిషనర్ సమర్పించిన నివేదిక వెల్లడించింది. దీంతో ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలట్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

లోకోపైలట్ ను అప్రమత్తం చేయలేదు

ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ పనిచేయని ప్రాంతంలో వెళ్లేప్పుడు లోకో పైలట్ కు సరైన నిర్దేశాన్ని చేయలేదని ఎత్తిచూపిది. ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ లేని ప్రాంతంలో నిర్ధిష్ట వేగంతో వెళ్లాలని లోకోపైలట్ ను అప్రమత్తం చేయలేదని సూచించింది. లోకో పైలట్, రైల్వే మేనేజర్ కు వాకీటాకీలు ఇవ్వలేదని పేర్కొంది. వాకీటాకీలు ఉండుంటే ప్రమాదాన్ని నిరోధించే అవకాశం ఉండేదని తెలిపింది. ఆటో-సిగ్నలింగ్ ప్రాంతాల్లో రైలు నిర్వహణ గురించి లోకో పైలట్‌లు, స్టేషన్ మాస్టర్‌లకు సరైన అవగాహన లేకపోవడమే ప్రమాదానికి కారణమని వివరించింది. నివేదిక సమర్పించిన తర్వాత సిగ్నలింగ్ పరికరాల విశ్వసనీయతను పెంచాలని, జోనల్ మేనేజర్ కోసం కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రెండు రైళ్లు ఒకే లైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాలను నివారించడంలో సాయపడే కవచ్ పై పనిచేస్తోంది. ఇకపోతే, జూన్ 17న గూడ్స్ రైలు కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టడంతో కనీసం 10 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో గూడ్స్ రైలు లోకో పైలట్, మరో ఇద్దరు రైల్వే సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed