వర్ణించడానికి మాటల్లేవు.. PM Modi recalls time spent on board INS Vikrant

by srinivas |   ( Updated:2022-09-03 12:20:45.0  )
వర్ణించడానికి మాటల్లేవు.. PM Modi recalls time spent on board INS Vikrant
X

న్యూఢిల్లీ: తొలి దేశీయ విమాన వాహాక నౌక విక్రాంత్ జలప్రవేశం చేసిన మరుసటి రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. విక్రాంత్ వద్ద గడిపిన సమయాన్ని, అనుభూతిని వర్ణించడానికి మాటలు రావట్లేదని చెప్పారు. ఈ మేరకు విక్రాంత్‌లో గడిపిన సమయాన్ని గుర్తు చేస్తూ శనివారం ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాటు విక్రాంత్ వీడియోను షేర్ చేశారు. 'దేశానికి చారిత్రాత్మక రోజు. శుక్రవారం ఐఎన్ఎస్ విక్రాంత్‌లో ఉన్నప్పుడు కలిగిన అనుభూతిని వర్ణించలేము' అని ట్వీట్ చేశారు. విక్రాంత్ జలప్రవేశంతో భారత్ అరుదైన ఘనతను సాధించింది. స్వదేశి పరిజ్ఞానంతో రూపొందించిన వాహకనౌకతో యూఎస్, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాల అరుదైన జాబితాలో చేరింది.

Next Story