Ajit Pawar : కులగణన చేయాల్సిందే.. అజిత్ పవార్ కీలక డిమాండ్

by Hajipasha |   ( Updated:2024-08-15 17:35:39.0  )
Ajit Pawar : కులగణన చేయాల్సిందే.. అజిత్ పవార్ కీలక డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో : కులగణనను బీజేపీ వ్యతిరేకిస్తుంటే..ఆ పార్టీతో మహారాష్ట్రలో స్నేహం చేస్తున్న ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్ మాత్రం దాన్ని సమర్ధిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పకుండా కులగణన చేయాల్సిందే అని ఆయన అభిప్రాయపడ్డారు.

గిరిజనులు, ఎస్సీలు, ఓబీసీలు, మైనారిటీలు ఎంతమంది ఉన్నారనేది కచ్చితంగా తెలియాలంటే కులగణన నిర్వహించక తప్పదన్నారు. ఆ సమాచారం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసుకోవచ్చని అజిత్ చెప్పారు. ‘‘సమాజంలోని ప్రతీ వర్గం కూడా తమ కోసం సంక్షేమ పథకాలు ఉండాలని కోరుకుంటుంది. కనీసం వారికోసమైనా కులగణన చేయాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. జనగణనతో కలిపి కులగణనను కూడా కనీసం ఒకసారైనా నిర్వహిస్తేనే బాగుంటుందని వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed