Shashi Tharoor: నీతి ఆయోగ్ సమావేశంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
Shashi Tharoor: నీతి ఆయోగ్ సమావేశంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని ఇండియా కూటమి నేతల నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించారు. అది వారి హక్కు అని స్పష్టం చేశారు. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు, డీఎంకే సీఎం స్టాలిన్ నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించారని గుర్తుచేశారు. బహిష్కరించిన నేతలు ఆయా ప్రాంతాలకు బడ్జెట్ లో ఏమీ కేటాయించలేదని.. వారు మీటింగ్ కు వచ్చి సమయాన్ని ఎందుకు వృథా చేసుకోవాలని అని అన్నారు. సంకీర్ణ భాగస్వాములను సంతృప్తి పరచడానికి బిహార్, ఆంధ్రప్రదేశ్ లకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని కేంద్రంపై మండిపడ్డారు. 'విద్య, ఆరోగ్యం రంగాలకు బడ్జెట్ తగ్గిపోయింది. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. తమ సంకీర్ణ భాగస్వామ్యుల కోసం ప్రభుత్వం రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. బీహార్‌ రాష్ట్రానికి లభించింది తమ రాష్ట్రానికి వస్తే సంతోషిస్తాం. బిహార్ లో హైవేల కోసం రూ.26వేల కోట్లు కేటాయించారు. ఇది చిన్న విషయం కాదు. బిహారీలకు మంచిదే. అయితే, కర్ణాటను కాస్త పట్టించుకోండి. బెంగుళూరులో హైవేలు, టన్నెల్స్ కోసం నిధులు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ వారికి ఏదీ దక్కలేదు. ఇది కేవలం రాజకీయవ్యూహమే”అని థరూర్ అన్నారు.



Next Story