నేను మతాన్ని గౌరవించనని ఎవరు చెప్పారు?

by John Kora |
నేను మతాన్ని గౌరవించనని ఎవరు చెప్పారు?
X

- మతం వ్యక్తిగత విషయం

- 'మృత్యు కుంభ్' వ్యాఖ్యలపై మమత వివరణ

దిశ, నేషనల్ బ్యూరో: అన్ని మతాలను తాను గౌరవిస్తాను. అసలు నేను మతాన్ని గౌరవించనని ఎవరు చెప్పారంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రశ్నించారు. మహాకుంభ మేళా సందర్భంగా జరుగుతున్న తొక్కిసలాటలను ఉద్దేశించి దాన్ని 'మృత్యు కుంభ్'గా మమత అభివర్ణించారు. మమత వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. తాను అన్ని మతాలను, సంస్కృతులను గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. మతం వ్యక్తిగత విషయమే అయినప్పటికీ, మతపరమైన పండుగలు మాత్రం అందరూ ఆనందించడానికే ఉన్నట్లు చెప్పారు. మతం ఒక వ్యక్తికి సంబంధించింది. కానీ మత పండుగలు మనందరికీ సంబంధించినవని అన్నారు. మనదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతీ రాష్ట్రానికి తమదైన భాషలు, విద్యా, సంస్కృతులు, నమ్మకాలు ఉన్నాయి. కానీ తాను అన్ని సంస్కృతులను గౌరవిస్తానని మమత చెప్పారు. అందుకే భిన్నత్వంలో ఏకత్వం అనేది తన ఫిలాసఫీగా అభివర్ణించారు.

కొన్ని సార్లు తనను మీకు పురుషుడా, స్త్రీవా అని అడుగుటుంటారు. అయితే నన్ను నేను మానవుడిగా భావిస్తాను. మానవత్వమే నాకు స్పూర్తి అని చెబుతుంటానని మమత చెప్పారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్ నిర్వహణ పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరును విమర్శించారు. తొక్కిసలాట ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని "మృత్యు కుంభ్"గా అభివర్ణించారు. అధికారులు మరణాల సంఖ్యను దాచిపెట్టారని కూడా ఆమె ఆరోపించారు.

Next Story