రెజ్లర్ల గురించి మీడియా ప్రశ్నలు.. పరుగులు పెట్టిన కేంద్ర మంత్రి (వీడియో)

by Mahesh |   ( Updated:2023-06-06 11:56:11.0  )
రెజ్లర్ల గురించి మీడియా ప్రశ్నలు.. పరుగులు పెట్టిన కేంద్ర మంత్రి (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో : రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూష‌ణ్‌ను అరెస్టు చేయాల‌ని రెజ్ల‌ర్లు ఆందోళ‌న దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే రెజ్ల‌ర్ల ఆందోళ‌న గురించి స్పందించాలని ఓ మ‌హిళా రిపోర్ట‌ర్ కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖిని ప్ర‌శ్నించారు. మంగళవారం ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని వ‌స్తున్న మంత్రి లేఖిని రెజ్ల‌ర్ల గురించి అడగ్గా..ఆమె పరుగందుకున్నారు. రిపోర్టర్ ప్ర‌శ్న‌కు బ‌దులు ఇవ్వ‌కుండా‘ చలో..చలో ...చలో..లీగల్ ప్రాసెస్ నడుస్తుంది అంటూ నడుచుకుంటూనే పరుగులు పెట్టారు. మ‌హిళా రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌లకు జ‌వాబు ఇవ్వ‌లేక ప‌రుగులు పెడుతున్న మంత్రి మీనాక్షి లేఖి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. దీనిని కాంగ్రెస్ పార్టీ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేస్తూ ట్రోల్ చేస్తుంది.

Advertisement

Next Story