AAP Vs Delhi LG: ఏం జోక్ చేస్తున్నారు? ఎల్జీపై ఆప్ ఫైర్

by Shamantha N |
AAP Vs Delhi LG: ఏం జోక్ చేస్తున్నారు? ఎల్జీపై ఆప్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM) అరవింద్ కేజ్రీవాల్(Kejriwal) ఆరోగ్యస్థితిపై రాజకీయాలు సాగుతున్నాయి. ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP), ఢిల్లీ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) మధ్య లొల్లి నడుస్తోంది. కాగా.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం కేసులో కేజ్రీవాల్ మార్చి నుంచి జైలులోనే ఉన్నారు. అయితే, కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ చేస్తున్న వాదనల నేపథ్యంలో వీకే సక్సేనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సీఎం ఎందుకు మందులు వాడటం లేదో తేల్చాలని పేర్కొన్నారు. కాగా.. ఈ లేఖపై ఆప్ స్పందించింది. ఢిల్లీకి చెందిన మంత్రి అతిషి, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఎల్జీ గవర్నర్ ని టార్గెట్ చేశారు.

ఆప్ విమర్శలు

ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ ఎల్జీ తీరుపై ఫైర్ అయ్యారు. ఆయన లేఖను ట్వీట్ చేస్తూ.. “ఎల్జీ సార్ ఏం జోక్ చేస్తున్నారు..? మనిషి రాత్రిపూట తన షుగర్ స్థాయిలను తగ్గించుకుంటాడా..?ఎల్జీ సార్, మీకు వ్యాధి గురించి తెలియకపోతే మీరు ఇలాంటి లేఖ రాయకూడదు” అని మండిపడ్డారు. అలాంటి వ్యాది మీకు రాకూడదని ఆ దేవుడి కోరుకుంటున్నాను అని ఎంపీ సంజయ్ సింగ్ సెటైర్ వేశారు. సీఎం కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఢిల్లీ మంత్రి అతిషీ ఆరోపించారు. కేజ్రీవాల్‌ షుగర్‌ 8 సార్లు 50 కంటే కిందకు పడిపోయిందని అన్నారు. ఇలాగే, కొనసాగితే, కేజ్రీవాల్ కోమాలోకి వెళ్లేలా ఆయన ఆరోగ్యం దిగజారిపోతుందన్నారు. ఇలాంటి పరిస్థితిలో.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉందన్నారు.

ఎల్జీ ఏమన్నారంటే?

ఆరోగ్యరీత్యా సీఎం కేజ్రీవాల్‌కు ఆయన ఇంటి నుంచే భోజనం అందుతోదని ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా అన్నారు. అయితే.. వైద్యులు సూచించిన దానికంటే తక్కువ మోతాదులో ఆయన కేలరీలను తీసుకుంటున్నారని ఆరోపించారు. జులై 7 రాత్రి భోజనానికి ముందు తీసుకోవాల్సిన ఇన్సులిన్‌ డోస్‌ను ఆయన తిరస్కరించినట్లు జైలు అధికారులు అందించిన నివేదికలో తెలుస్తోందన్నారు. ఇది కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. ఆయనా ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన షుగర్ లెవల్స్ అదుపులో ఉండేలా డాక్టర్ల సూచనలు పాటించేలా ప్రొటోకాల్ అమలు చేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed