- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
50 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేనిది.. పదేళ్లలో మోడీ చేశారు: గోవా సీఎం
by Hajipasha |

X
దిశ, నేషనల్ బ్యూరో : గత 50 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేనిది.. కేవలం గడిచిన పదేళ్లలో కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు చేసి చూపించిందని గోవా ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రమోద్ సావంత్ అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో దేశ ప్రజలంతా ఎన్డీయే కూటమి వెంటే నడుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమికి నూటికి నూరు శాతం సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. వికసిత భారత్ కోసం దేశ ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వాన్నే ఇష్టపడుతున్నారని ప్రమోద్ చెప్పారు. కర్ణాటకలోని బెళగావిలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి, మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ సీఎం యడియూరప్ప, గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు.
Next Story