- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
IPSOS Survey: మనదేశంలో అత్యంత గౌరవనీయమైన, నీఛమైన వృత్తులేంటో తెలుసా ?
దిశ, వెబ్ డెస్క్: వృత్తి.. ఇది ఉద్యోగం గురించి మాత్రమే కాదు. మనిషి బతకడానికి చేసే పని. బతకాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే పని చేయాలి. అది కూలి పనైనా, కంప్యూటర్ ముందు కూర్చుని చేసే పనైనా.. వృత్తి అనే అంటారు. కాకపోతే కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తే.. స్టైల్ గా జాబ్ అంటారు.. ఎండలో కష్టపడితే కూలి పని అంటారు. ఇది ఈనాడు కాదు.. ఏనాటి నుంచో జనాల మెదడుల్లో పాతుకుపోయింది. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. ఇటీవల ఇండియాలో గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ ఒపీనియన్ స్పెషలిస్ట్.. IPSOS రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే.. అత్యంత గౌరవనీయమైన వృత్తులు, అత్యంత నీఛమైన వృత్తులపై ప్రజలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
2024లో భారత్ లో మోస్ట్ ట్రస్టెడ్ ప్రొఫెషన్స్ లో 57 శాతం అర్బన్ ఇండియన్స్ డాక్టర్ వృత్తికి జై కొట్టారు. చాలామంది తాము పనిచేస్తున్న వృత్తే గౌరవమని తెలిపారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ లో 56 శాతం, టీచర్స్ గా 56 శాతం మంది ఉన్నారు. సైంటిస్టులు అయ్యేందుకు 54 శాతం, జడ్జి వృత్తికి 52 శాతం, బ్యాంకర్స్ జాబ్ కు 50 శాతం, పోలీసు వృత్తికి 47 శాతం మొగ్గుచూపారు. 49 శాతం మంది మహిళలు, పురుషులు ఏ వృత్తీ లేకుండా ఉండటమే గౌరవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఇతర ఉద్యోగాల్లో.. రెస్టారెంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది (47%), టాక్సీ డ్రైవర్లు (46%), ప్రభుత్వ ఉద్యోగులు/సివిల్ సర్వెంట్లు (46%), వ్యాపార నాయకులు (44%), అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్‌లు 44 శాతం మంది ఉన్నారు. పోల్ స్టర్లు 45 శాతం, టీవీ యాంకర్లు, న్యూస్ రీడర్లు 44 శాతం, లాయర్లు 43 శాతం, జర్నలిస్టులు 43 శాతం మంది ఉన్నారు. వీటన్నింటిలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువత వైద్య వృత్తికే అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఆ తర్వాత సైంటిస్ట్, టీచర్స్ జాబ్స్ కు మొగ్గు చూపారు.
నమ్మదగని వృత్తులు
నమ్మే వృత్తులు ఉన్నట్లే.. నమ్మదగని వృత్తులు కూడా ఉన్నాయని ఈ సర్వే తెలిపింది. నమ్మదగని వృత్తుల్లో ఫస్ట్ ప్లేస్ లో రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు (31%), క్యాబినెట్ అధికారులు / ప్రభుత్వ మంత్రులు (28%) మరియు మతాధికారులు / పూజారులు (27%). పోలీసులు (28%), అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్‌లు (25%), టీవీ న్యూస్ యాంకర్లు/ రీడర్లు (25%), ఉద్యోగులు/ పౌర సేవకులు (24%). చాలా ప్రాంతాల్లో రాజకీయ నాయకులపై నమ్మకం లేదు. కొలంబియా (74%), చిలీ (73%), అర్జెంటీనా (73%), రష్యా (70%), స్పెయిన్ (70%), హంగరీ (70%)లలో పొలిటీషియన్లను ఎక్కువగా నమ్మడం లేదు.