CM Chandrababu: ఆడబిడ్డల జోలికి వస్తే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్

by Shiva |   ( Updated:2024-11-21 11:17:07.0  )
CM Chandrababu: ఆడబిడ్డల జోలికి వస్తే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడబిడ్డల జోలికి వస్తే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని.. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇవాళ అసెంబ్లీ (Assembly)లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ బిల్ (Prevention of Dangerous Activities Bill), ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024 (Land Grabbing Act-2024) బిల్లు చర్చ సందర్భంగా ఆయన ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ.. కుటుంబాలపై సోషల్ మీడియా (Social Media)లో పోస్టులు పెట్టిన వారిని మాజీ సీఎం జగన్ (Former CM Jagan) వెనకేసుకురావడం సిగ్గుచేటని అన్నారు.

వర్రా రవీందర్ (Varra Ravinder) పేరుతో వేరేవాళ్లు పోస్టులు పెట్టారని జగన్ (Jagan) చెప్పడం హస్యాస్పందంగా ఉందన్నారు. ఈ మధ్య కాలంలో పేటీఎం బ్యాచ్‌ (Paytm Batch)ను పెట్టుకుని సోషల్ మీడియా (Social Media)లో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో డిజిటల్ మీడియా కార్పొరేషన్ (Digital Media Corporation) పేరుతో డబ్బులిచ్చి పోస్టలు పెట్టించారని ఆరోపించారు. తప్పుడు పోస్టులు పెట్టే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తామని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా (Social Media)లో ఎప్పుడు ఎవరి ఫొటోను మార్ఫింగ్ చేసి పెడతారో తెలియని పరిస్థితి ఉందన్నారు. నోటితో పలకడానికి కూడా వీలు లేకుండా పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. తల్లి, సోదరిపై పోస్టులు పెట్టిన వారిని మాజీ సీఎం సమర్ధిస్తున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

Read More : భూములను ఆక్రమిస్తే ఇక బయట తిరగలేరు.. సీఎం చంద్రబాబు హెచ్చరిక

Advertisement

Next Story

Most Viewed