Delhi: ఒక్కరోజు కాకముందే మాపై విమర్శలా?- ఢిల్లీ సీఎం

by Shamantha N |
Delhi: ఒక్కరోజు కాకముందే మాపై విమర్శలా?- ఢిల్లీ సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా((Rekha Gupta)), మాజీ సీఎం అతిషీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ ఎన్నికల హామీలను నెరవేర్చలేదంటూ ఆప్ నేత అతిషీ చేసిన విమర్శలను రేఖా గుప్తా కొట్టిపారేశారు. ఢిల్లీ సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఢిల్లీని కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్‌ 13 ఏళ్లు పాలించాయి. ఇన్నేళ్లపాటు మీరేం చేశారో చూసుకోకుండా.. అధికారంలోకి వచ్చి ఒక్కరోజు కూడా కానీ మాపై విమర్శలు చేస్తారా..? ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే మేం కేబినెట్ సమావేశం జరిపాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయుష్మాన్‌ భారత్‌ యోజనను అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రజలకు రూ.10లక్షల మేర వైద్యసహాయం అందనుంది. ఆప్ మాత్రం ఈ పథకాన్ని అమలు చేయలేదు. అలాంటి వారికి మమ్మల్ని ప్రశ్నించే హక్కు వారికి లేదు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఢిల్లీకి అన్ని హక్కులు అందుతాయి. ముందు మీ పార్టీ గురించి ఆలోచించండి. ఎంతోమంది మీ పార్టీని వీడాలని చూస్తున్నారు. కాగ్ రిపోర్టును అసెంబ్లీలో పెడితే ఎవరి జాతకాలేంటో అందరికి తెలుస్తోంది.’’ అని మండిపడ్డారు.

అతిషీ విమర్శలు

ఇకపోతే, గురువారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత వెంటనే బాధ్యతలు స్వీకరించి కేబినేట్ సమావేశం జరిపారు. అయితే, ఢిల్లీలో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థికసాయం అందించే పథకాన్ని తొలి కేబినెట్ సమావేశంలో ఆమోదిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని.. కానీ తొలిరోజే దాన్ని ఉల్లంఘించిందని అతిషీ విమర్శించారు. కాగా.. ఈ వ్యాఖ్యలపైనే ఢిల్లీ సీఎం రేఖాగుప్తా స్పందించారు.

Next Story

Most Viewed