- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దానిని పాకిస్థాన్ అడ్డుకోబోదని తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్‌లో శాంతి నెలకొందని, పీఓకేలో ఆజాదీ నినాదాలు వినపడుతున్నాయని తెలిపారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందని మణిశంకర్ అయ్యర్, ఫరూక్ అబ్దుల్లాలు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..ఆ దేశం బాంబులు పెట్టినా పీఓకేను వెనక్కి తీసుకుంటామని తేల్చి చెప్పారు. బీజేపీ దేనికీ భయపడబోదని సూచించారు. పీఓకే భారత్ భూభాగమేనని చెప్పారు. గతంలో ప్రజలు మా కశ్మీర్‌లో నిరసనలు చేసేవారు.ఇప్పుడు ప్రధాని మోడీ ప్రభావంతో, కశ్మీర్‌లోని భారత భాగంలో ఎటువంటి ఆందోళనలు జరగడం లేదని తెలిపారు. కశ్మీర్‌ను రెండు కోట్ల మంది పర్యాటకులు సందర్శించి కొత్త రికార్డు సృష్టించారన్నారు.