కశ్మీరి పండిట్లను రక్షించే ప్రణాళికలు లేవు.. కేంద్రంపై ఢిల్లీ సీఎం విమర్శలు

by Manoj |   ( Updated:2022-06-05 10:02:18.0  )
కశ్మీరి పండిట్లను రక్షించే ప్రణాళికలు లేవు.. కేంద్రంపై ఢిల్లీ సీఎం విమర్శలు
X

న్యూఢిల్లీ: ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జమ్ముకశ్మీర్ పౌర హత్యలపై బీజేపీని విమర్శించారు. కశ్మీరి పండిట్లను రక్షించేందుకు కేంద్రం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఓ సమావేశంలో మాట్లాడారు. కశ్మీర్‌లో 1990ల నాటి పరిస్థితి మళ్లీ వచ్చిందని అన్నారు. లోయ ప్రాంతంలో హత్య జరిగినప్పుడల్లా హోంమంత్రి సమావేశమైనట్లు వార్తలు మాత్రమే వస్తున్నాయని ఎద్దేవా చేశారు. సమావేశాలు కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

గత 30 ఏళ్లలో బీజేపీ రెండు సార్లు అధికారంలోకి వస్తే, రెండు సార్లు కశ్మీరి పండిట్లు వలసలు వెళ్లారని తెలిపారు. బీజేపీవి మురికి రాజకీయాలని విమర్శించారు. మరోవైపు కశ్మీర్‌లో సామాన్యులపై ఉగ్రదాడుల నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ పండిట్ల కోసం తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. తాము కశ్మీరి పండిట్లకు మద్దతిస్తామని చెప్పారు. ప్రస్తుతం జమ్ములో పరిస్థితుల్లో అస్థిరంగా ఉన్నాయని, పండిట్లను స్వాగతిస్తామని తెలిపారు. కశ్మీర్ పరిస్థితులు పదే పదే పునరావృతం కావడం దురదృష్టకరమని అన్నారు. భారత ప్రభుత్వం వారి భద్రత కోసం సరైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed