- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Wayanad landslides: వయనాడ్‌లో హృదయ విదారక ఘటన.. మృతదేహాల సామూహిక ఖననం
by Ramesh Goud |

X
దిశ, డైనమిక్ బ్యూరో: వయనాడ్ ప్రకృతి విధ్వంసం కారణంగా హృదయ విదారక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.కొండచరియల కింద దొరికిన మృతదేహాలను అధికారులు సామూహిక ఖననం చేశారు. గతంలో బ్రెజిల్ దేశంలో కరోనా మహమ్మారి చేసిన విలయతాండవంలో బలైన వారిని సామూహిక ఖననాలు చేయడం చూశాము. ఇప్పుడు ఇలాంటి ఘటనే కేరళలో చూస్తున్నాం. వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడటంతో వాటి కింద చిక్కుకొని వందలమంది తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వయనాడ్ లో సహాయక చర్యలు కొనసాగుతోండగా.. శిధిలాల కింద చిద్రమైన వందల మృతదేహాలు బయటపడుతున్నాయి. అధికారులు ఇందులో గుర్తుపట్టలేకుండా ఉన్న మృతదేహాలను, విడి భాగాలను కలిపి పుదుమల ప్రాంతంలో సామూహికంగా ఖననం చేశారు. మృతులకు శాంతి కలగాలని కోరుకుంటూ ఖననం చేసిన చోటే సర్వమత ప్రార్ధనలు చేశారు. ఈ చిత్రాలు చూపరుల హృదయాలను విలవిలలాడేలా చేస్తున్నాయి.
Next Story