- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను మీకు సేవ చేయడానికే పుట్టాను: ప్రధానమంత్రి మోడీ
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ బహిరంగ సభలో ప్రసంగించారు. 'నేను సేవ చేయడానికే పుట్టాను. మీకు సేవ చేసేందుకే మీరు నాకు పని ఇచ్చారు ' అని మోడీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల బెడదను అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని విమర్శించారు. 'కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా దేశంలో ఉగ్రవాదులు, మావోయిస్టులు మరింత ఉత్సాహంగా ఉంటున్నారు. నక్సల్స్ హింసను నియంత్రించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఇటీవలి కాలంలో ఇక్కడం చాలామంది బీజేపీ కార్యకర్తలు చంపబడ్డారని' మోడీ తెలిపారు. గిరిజనుల సంక్షేమమే బీజేపీ ప్రథమ ధ్యేయం. ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన మహిళ భారత రాష్ట్రపతి అవుతారని ఎవరైనా అనుకున్నారా అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని మోడీ ప్రస్తావించారు. రాష్ట్రంలో గిరిజన్ కుటుంబాలకు చెందిన చాలామంది బాలికలు అదృశ్యమయ్యారు. కాంగ్రెస్ బుజ్జగింపు విధానం వల్ల ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా ప్రాంతంలో పండుగలు జరుపుకోవడం కూడా కష్టంగా మారిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తొలిదశ పోలింగ్ 20 స్థానాల్లో జరుగుతోంది. వాటిలో చాలావరకు మావోయిస్టు ప్రభావిత బస్తర్‌లో ఉన్నాయి.