17 గంటల పాటు నిరీక్షణ.. అక్కడికి వెళ్లేందుకు మార్గం సుగమం

by Shiva |
17 గంటల పాటు నిరీక్షణ.. అక్కడికి వెళ్లేందుకు మార్గం సుగమం
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో భారీ వర్షం కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ వెళ్లే జాతీయ రహదారిని 17 గంటల పాటు మూసి వేశారు. దీంతో వందలాది మంది భక్తులు రోడ్లపై వాహనాల్లో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. గురువారం ఉదయం చింకా సమీపంలో ఉదయం 9:50 ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడటంతో దాదాపు 100 మీటర్ల మేర రహదారి పూర్తిగా ధ్వంసమైంది. 10 గంటలకు రహదారిని బ్లాక్ చేసి శుక్రవారం తెల్లవారుజామున 3.30 కి తిరిగి వాహనాలను అనుమతించినట్లు అదనపు సమాచార అధికారి చమోలి రవీంద్ర నేగి తెలిపారు. ముందుగా బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ నుంచి తిరిగి వచ్చే వాహనాలను మొదటగా క్లియర్ చేశారు. బిర్హి, చమోలి, పిపాల్‌కోటిలలో చిక్కుకున్న యాత్రికుల కోసం స్థానిక అధికారులు ఆహారాన్ని అందజేశారు.

Advertisement

Next Story