Viral Video: అమ్మ మససు చాటుకున్న మహిళా ఎస్ఐపై ప్రశంసలు!

by Ramesh Goud |
Viral Video: అమ్మ మససు చాటుకున్న మహిళా ఎస్ఐపై ప్రశంసలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ మహిళా ఎస్ఐ అధికారిణిగా కాఠిన్యం చూపిస్తూ.. అంతలోనే అమ్మలాంటి లాలిత్యాన్ని పంచిన ఆసక్తికర ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. బాగల్ కోట్ పట్టణానికి చెందిన మహిళా ఎస్ఐ విధినిర్వహణలో భాగంగా రోడ్లపై వాహానాలను ఆపి చెకింగ్ నిర్వహిస్తున్నారు. అంతలోనే ఓ ద్విచక్రవాహానంపై ముగ్గురు విద్యార్ధులు రావడం గమణించి వారిని ఆపారు. ట్రిపుల్ రైడింగ్లో వెళుతున్నందుకు వారికి ఫైన్ వేశారు. అందులో ఒక కుర్రాడు తన వద్ద మాత్రమే డబ్బులు ఉన్నాయని, అవి కూడా కాలేజీలో ఫీజు కట్టేందుకు తీసుకెళుతున్నామని చెప్పి బావురుమన్నాడు.

ఇది చూసిన ఆ మహిళా ఎస్ లో ఒక్క సారిగా అమ్మతనం బయటకి వచ్చింది. ఆ ఏడుస్తున్న కుర్రాడ్ని దగ్గరికి తీసుకొని ఓదార్చింది. విద్యార్ధి కళ్లు తుడిచి, తన వద్ద ఉన్న కొంత డబ్బును ఆ విద్యార్ధికి ఇచ్చింది. అనంతరం వారికి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చి, జాగ్రత్తగా వెళ్లాలని సూచించి అక్కడి నుంచి పంపించింది. ఈ సంఘటనను అక్కడే ఉన్న వ్యక్తులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన వారు మహిళ ఎస్ఐ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆ మహిళా ఎస్ఐ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.



Next Story